కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై పాలీగాఫ్ టెస్ట్..

కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో గురువారం ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఝోష్ పై పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు సిబిఐ అధికారులకు స్పెషల్ కోర్టు అనుమతులిచ్చింది. ఈ కేసులో కాలేజీ ప్రిన్స్‌పాల్‌ తో పాటు మరో నలుగురు డాక్టర్లపై పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు అనుమతులిచ్చింది.

 

ఆగస్టు 9న ఉదయం 3 గంటల సమయంలో కోల్ కతా లోని ఆర్ జి కార్ మెడికల్ కాలేజి అనే ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఓ జూనియర్ మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన దేశ్యవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న నలుగురు డాక్టర్లు, కాలేజీ ప్రిన్సిపాల్ ను సిబిఐ అధికారులు గత కొన్ని రోజులుగా విచారణ చేస్తున్నారు.

 

హత్యాచారం ఘటన జరిగిన రోజే ప్రిన్సిపాల్ సందీప్ ఝోష్ ని పదవి నుంచి తొలగించారు. అయితే మరుసటి రోజే ఆయనకు మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా నియమించబడ్డారు. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. కోల్ కతా హై కోర్టు ఈ కేసు విచారణ బాధ్యతలు సిబిఐ కి అప్పగించింది.

 

ఈ క్రమంలో సిబిఐ అధికారులు ప్రిన్సిపాల్ సందీప్ ఝోష్ ని విచారణ చేస్తున్నారు. ఆయన ఆస్పత్రి లోని శవాలను అమ్ముకునేవాడని ఆరోపణలు రావడంతో.. సిబిఐ అధికారులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. దీంతో ప్రిన్సిపాల్ సందీప్ ఝోష్, ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్లపై పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు అనుమతులివ్వాలని స్పెషల్ కోర్టును సిబిఐ అధికారులు కోరారు.

 

పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే పోలీసులు నిందితులు, అనుమానితుల చేత నిజం చెప్పించేందుకు ఉపయోగించే ఎలెక్ట్రానిక్ మెషీన్. అయితే దీన్ని కోర్టు అనుమతి, అనుమానితుడి అంగీకారంతోనే ఉపయోగించాలనే నియమం ఉంది.

 

ఈ కేసు విచారణ సుప్రీం కోర్టులో కూడా కొనసాగుతోంది. సుప్రీం కోర్టులో సిబిఐ లాయర్ వాదిస్తూ.. కోల్ కతా పోలీసులు కేసుని పక్కదాడి పట్టించేందుకు ఘటానా స్ఠలాన్ని నాశనం చేశారని ఆరోపించారు.

 

మహిళా డాక్టర్ పై హత్యాచారం చేసిన కేసులో పోలీసులు సంజయ్ రాయ్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతను ఒక సైకో అని, గతంలో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *