ఈడీ ఆఫీసు.. కాంగ్రెస్ నేతల ధర్నా..

బిజినెస్‌మేన్ అదానీ వ్యవహారంపై తేల్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్ మంత్రులు, నేతలు ధర్నాకు దిగారు. అదానీ కుంభకోణంపై కచ్చితంగా విచారణ జరపాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు.

 

హిండెన్‌బర్గ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ సంస్థలపై ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ, మోదీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అదానీ మెగా కుంభకోణంపై విచారణ చేయాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈడీ కార్యాలయాల ముందు నేతలు ఆందోళనకు దిగారు.

 

ఇందులోభాగంగా హైదరాబాద్‌లో గన్ పార్క్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ మంత్రులు, నేతలు, కార్యకర్తలు. అక్కడి నుంచి నేరుగా ఈడీ ఆఫీసుకు వరకు ర్యాలీ చేపట్టారు. సెబీ చీఫ్ మాదభీ బచ్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతబట్టి, మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

దేశ సంపదను అదానీ కొల్లగొడుతున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అదానీ ఆస్తులపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జేపీసీ వేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా రాహుల్ డిమాండ్ చేసిన విషయాన్ని వివరించారు.

 

పనిలోపనిగా బీఆర్ఎస్‌పైనా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మంత్రులు. ఆ పార్టీకి దేశం మీద ప్రేమ ఉంటే ధర్నా చేయాల్సి రుణమాఫీపై కాదని, అదానీపై చేయాలన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని ప్రజలు ఊహించలేదన్నారు సంపత్‌కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *