కోల్‌కతా ట్రైనీ హత్యాచార ఘటన పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

కోల్‌కతా ట్రైనీ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీలో భద్రత కోసం నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు 10మంది డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా వైస్ అడ్మిరల్ డాక్టర్ ఆర్ కె సారిన్‌ను నియమించిది. ఈ టాస్క్ పోర్స్‌లో ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.

 

అలాగే డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా, ప్రొఫెసర్ పల్లవి సప్రే, డాక్టర్ పద్మ శ్రీవాస్తవ ఉన్నారు. డాక్టర్ల భద్రతపై సూచనలు, అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది.

 

ఈ టాస్క్‌ ఫోర్స్ అన్ని వర్గాలను సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని సీజేఐ ఆదేశించింది. అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనపై ఈనెల 22లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

కోల్ కతా ఘటనపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. గురువారం లోగా ఇవ్వాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. ఆస్పత్రి ఆవరణలో వస్తువులను ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *