సీఎం రేవంత్‌కు షాక్..1000 కోట్ల డీల్ పైఈడీకి ఫిర్యాదు..!

సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ గట్టిగా వెంటాడుతోంది. ఆగష్టు 6వ తేదీన రేవంత్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం స్వచ్చ్ బయో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా స్వచ్చ్ బయో సంస్థ తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్.

 

ఈ ఒప్పందంలో స్వంత ప్రయోజనాలున్నాయని క్రిషాంక్ ఆరోపణలు చేశారు. అంతేకాదు క్విడ్ ప్రోకో కూడా జరిగే అవకాశం ఉందని తెలిపారు. స్వచ్చ్ బయో సంస్థలోని డైరెక్టర్లలో ఒకరైన అనుముల జగదీశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సోదరుడు. దీంతో ఈ ఒప్పందంపై కొన్ని అనుమానాలు ఉన్నాయని ఈడీ ఫిర్యాదులో పేర్కొన్నాడు క్రిషాంక్.క్రిషాంక్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న ఈడీ అధికారులు ఇందుకు సంబంధించి రశీదును కూడా ఇచ్చారు.

అంతేకాదు స్వచ్చ్ బయో అనే సంస్థ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లే ఐదు రోజుల ముందు మాత్రమే స్థాపించడం జరిగిందని క్రిషాంక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.జూబ్లీహిల్స్ అడ్రస్‌తో రిజిస్టర్ అయిన ఈ కంపెనీలో ఎలాంటి క్రియాశీలక కార్యకలాపాలు జరగలేదని ఇదొక షెల్ కంపెనీ అని క్రిషాంక్ ఆరోపించారు. అమెరికాలో ఈ కంపెనీ గురించి ప్రకటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన క్రిషాంక్, ఇందులోకి ఏమైనా విదేశీ నిధులు వస్తున్నాయా అని అడిగారు.మనీలాండరింగ్‌తో ఏమైనా సంబంధాలున్నాయా అని ఫిర్యాదులో క్రిషాంక్ ప్రశ్నించారు.

 

ఇక ఈ ప్రాజెక్టు గురించి అమెరికాలో ఎంఓయూ కుదుర్చుకునే సమయంలో సీఎం రేవంత్ పక్కనే ఉన్న వ్యక్తి హర్ష పసనూరి అని తనకు ఈ సంస్థతో ఏంటి సంబంధమని ఫిర్యాదులో అడిగారు.హర్ష పసనూరి, సీఎం రేవంత్ సోదరుడు జగదీశ్వర్ వారి ఆర్థిక పరిస్థితులను వివరించాలని డిమాండ్ చేసిన క్రిషాంక్… రూ1000కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలా ముందుకు వచ్చారో చెప్పాలని కోరారు.

 

తెలంగాణ ప్రభుత్వం స్వచ్చ్ బయో మధ్య జరిగిన ఎంఓయూ ప్రక్రియపై వెంటనే విచారణ జరపాలని ఈడీని క్రిషాంక్ కోరారు.ఇందులో పూర్తిగా అవినీతి కనిపిస్తోందని ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ ప్రారంభించాలని అదే సమయంలో స్వచ్చ్ బయో డైరెక్టర్స్, సీఎం రేవంత్ రెడ్డిని కూడా విచారణ చేయాలని ఫిర్యాదులో క్రిషాంక్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *