ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకకాలంలో పది చోట్లా మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతి, భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఓ న్యూస్ ఛానెల్ యజమాని ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.