సంక్రాంతి బరిలో మెగాస్టార్ డబుల్ ధమాకా..! అటూ కాకా ఇటూ విశ్వంభర..?

విశ్వంభర…ఎన్నాళ్ళగానో వాయిదాల పాట పాడుతున్న ఈ సినిమా రిలీజ్ పై తాజాగా ఒక క్రేజీ రూమర్ వినిపిస్తుంది.అవును..ఈ సినిమా వచ్చే పొంగల్ బరిలో దిగబోతుందన్న టాక్ వినిపిస్తుంది.నిజానికి ఈ సినిమా ఎప్పుడో ఏడాది కిందటే విడుదల కావాల్సి ఉన్నా సినిమా vfx ,విజువల్స్ క్వాలిటీ రావాలన్న ఉద్దేశంతో చాలా రోజుల పాటు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకి వచ్చే ఏడు సంక్రాంతికి రిలీజ్ కానుందని తెలుస్తుంది.

నిజానికి బింబిసార అంటూ కళ్యాణ్ రామ్ తో హిస్టారికల్ వండర్ ని తీసిన మల్లిడి వశిష్ట చిరుతో విశ్వంభర అని సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచేమంచి హైప్ ఏర్పడింది.ఇక చాలా ఏళ్ళకి మెగాస్టార్‌ని ఒక కొత్త ఫాంటసీ వరల్డ్‌లో చూడబోతున్నాం అని మురిసిపోయారు మెగా ఫ్యాన్స్.ఇక చిరంజీవి కెరీర్‌లో ఫాంటసీ సినిమాలకు స్పెషల్ ప్లేస్ ఉంటుందని కొత్తగా చెప్పక్కర్లేదు.

జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి అంజి వరకు మనల్ని ఎంతగానో అలరించిన సినిమాలు చేసుకుంటు వచ్చిన చిరు విశ్వంభర తో కూడా అలాంటి అనుభూతినే క్రియేట్ చేస్తాడని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు మూవీ లవర్స్. కాని సినిమా మొదలై మూడేళ్ళు అయినా ఇప్పటికీ థియేటర్ లలోకి రాకపోవడంతో డీలా పడిపోయారు.

మొత్తానికి ఈ సినిమా పొంగల్ సీజన్ లో వస్తుందన్న వార్తలు ఇపుడు అభిమానుల్లో జోష్ ని నింపుతున్నాయి.పైగా ఈ సినిమాకి సంబందించిన పలు డబ్బింగ్ పిక్స్ యూవీ మీడియా అకౌంట్స్ లో ఈ తెగ చక్కర్లు కొడుతుండటం ఈ వార్తలకి మరింత బలానిస్తున్నాయి.పైగా థియేటర్ బిజినెస్ అయిపోయిందని, ఓటిటి డీల్ ప్రకారం సంక్రాంతికి రావడం తప్ప విశ్వంభరకు వేరే ఆప్షన్ లేదని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

అయితే ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో వస్తామన్న కాకా సినిమా ఇపుడు ఒక నెల లేట్ గా అంటే శివరాత్రికి వచ్చే అవకాశం ఉందని సమాచారం.వాల్తేరు వీరయ్య వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై చిరు భారీ ఆశలే పెట్టుకున్నాడు.ఇక ఇప్పటి వరకు వచ్చిన అప్ డేట్స్ చూస్తుంటే మేకర్స్ ఎదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. కాని వస్తామని ఊదరగొట్టిన కాక వెనక్కి వెళ్ళిపోవడం,అసలేమాత్రం అప్ డేట్ లేని విశ్వంభర పొంగల్ పావు ఖర్చీఫ్ వేయడం ఫ్యాన్స్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఏది ఏమైనా భారీ గ్రాఫిక్స్ ,విజువల్ ఎఫెక్ట్స్ తో తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తానంటూ సంక్రాంతి బరిలోకి దిగబోతున్న విశ్వంభరపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూడాలి మరి ఆ అంచనాలని ఈ విశ్వంభరుడు ఏ మేరకి అందుకుంటాడో !