ఏపీకి అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్..! విద్యా సంస్థలకు సెలవు..!

శ్రీకాకుళం అక్వాన్ తుఫాన్ నేపధ్యంలో  విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పలాస రెవెన్యూ డివిజన్ లో అన్ని మండలాల్లో విద్యా సంస్దలకు అధికారులు సెలవు ప్రకటించారు. జిల్లాలో తీరప్రాంత 11 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిగా  సెలవు ప్రకటించారు. అక్వాన్ తఫాన్ కారణంగా జిల్లాల్లో  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందరి అధికారులు తెలిపారు.

అక్వాన్ తుఫాన్ నరసాపురం – పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒరిస్సాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో బహుదా నది పరివాహక ప్రాంతాన్ని అధికారులు అలర్ట్ చేసారు. ఇచ్ఛాపురంలో పలు ప్రాంతాలకు వరద ముప్పు ఉందని అటువైపు ఏవరు వెల్లవద్దని అధికారులు తెలిపారు.