ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం బిగ్ అప్డేట్..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీతో పాటు అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం వివిధ వర్గాలకు ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ బీమా పథకాలను ఈ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం గొడుగు కిందకు వస్తాయని స్పష్టం చేశారు. వివిధ శాఖల్లోద్వారా ప్రస్తుతం ఉన్న నేతన్న, గౌడ, కార్మిక, మత్సకారులకు అమలులో ఉన్న రెండు లక్షల రూపాయల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఐదు లక్షల రూపాయలకు పెరుగుతాయని అన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ ఈ పథకంలో నమోదు చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు అన్ని మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. పథకం మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటిస్తూ, నమోదు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. దాదాపు నెలరోజుల పాటు కొనసాగే ఈ నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ఈ భీమా నమోదుకు ప్రత్యేక యాప్ కు కూడా రూపొందిస్తున్నామని, ఆన్-లైన్ లోనూ నమోదుకు దరఖాస్తులను అందుబాటులో ఉంచాలన్నారు.