కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో.. కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి.

గతంలో కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హజరయ్యారు. నాంపల్లిలోని మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై గత పాలకులు కేసు నమోదు చేసారు.

అయితే ఆ కేసులో భాగంగా ముఖ్యమంత్రి కోర్టుకు హాజరయ్యారు. 2021 ఏప్రిల్‌ 11న నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల భాగంగా ప్రచారం నిర్వహించారు. దీంతో అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాస్కులు ధరించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు పై సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లిలోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది. ఈ క్రమంలో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) 313 కింద నిందితుల వాంగ్మూల నమోదు ప్రక్రియ కోసం కేసు విచారణకు రానుంది. దీంతో సీఎం రేవంత్ హజరయ్యారు.