దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తో చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)విలన్ గా నటిస్తున్నారు? ఎస్ ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూ.290 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ వెలువడ లేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో సరికొత్త రికార్డు ఈ సినిమా సొంతం చేసుకోబోతోందని చెప్పవచ్చు.
ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా బిజినెస్ చేసిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా రూ.225 కోట్ల ధర పలికింది. వారణాసి థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా గట్టిగానే పోటీ పడ్డాయి. కానీ చివరికి మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు , రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి కథాంశం స్టార్ కాస్ట్ తో ఈ మూవీ రూపొందుతోంది. భారీ నిర్మాణ విలువలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని నెలలకు మాత్రమే ఉన్నా.. ఇంకా ఇప్పటికి ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు? అనే విషయం బయటకు రాకుండా రాజమౌళి పడుతున్న జాగ్రత్త అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. ఇక ఇప్పటివరకు వచ్చిన కొన్ని స్టిల్స్, గ్లింప్స్ విడుదలైనా అన్నీ కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలు పెంచేసాయి. మరి భారీ స్థాయిలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. దీనికి తోడు నవంబర్లో మరో భారీ రివీల్ ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.