ఒకప్పుడు సినిమా నుండి ఏదైనా సన్నివేశం లీక్ అయ్యింది అంటే దర్శక నిర్మాతలు ఎక్కడలేని టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో వారే సినిమాపై అంచనాలు పెంచడానికి చిన్న చిన్న బిట్స్ లీక్ చేస్తున్నారనే కామెంట్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి (megastar Chiranjeevi) తాజాగా ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో కాకా (Kaaka) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఒకవైపు సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుండగా.. మరొకవైపు సినిమా నుండి ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇందులో ఊర మాస్ గెటప్‌లో చిరంజీవి మాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే అప్పుడెప్పుడో 2016లో ఆటో జానీ చిత్రాన్ని ప్రకటించి మళ్లీ పట్టాలెక్కించకుండా ఆగిపోయిన ఆ గెటప్ లో చిరంజీవి కనిపించడంతో అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. ఆటో జానీ గెటప్ లో చిరంజీవి లుక్ అదుర్స్ అంటూ లీకైన వీడియోని తెగ వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికైతే తాజాగా లీకైన వీడియో ఇప్పుడు సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పాలి.
వైరల్ గా మారిన లీక్డ్ వీడియోలో ఏముంది అనే విషయానికొస్తే చిరంజీవి ఆటో జానీ గెటప్‌లో స్టైలిష్ గా ఒక చేత్తో సిగరెట్ తాగుతూ.. మరొకవైపు నడుచుకుంటూ ప్రముఖ బలగం యాక్టర్ మురళీధర్ గౌడ తో మాట్లాడుతున్న ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో లీక్ అయింది. పైగా అక్కడేదో పెళ్లి వేడుక జరుగుతున్నట్లు అందులో మనం చూడవచ్చు. కళ్ళజోడు, చెవికి రింగు, నోటిలో సిగరెట్టు, ఆయన స్నాగ్ మరోసారి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తానికైతే కాకా సినిమాలో చిరంజీవి గెటప్ మరో లెవెల్లో ఉండబోతోంది అనే కామెంట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి.
కాకా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరంజీవి కదిరి కాళిదాస్ అలియాస్ కే సత్యం పాత్రలో నటిస్తున్నారు. ఒక రహస్య గ్యాంగ్ స్టర్ ఆక్వా ఫ్యాక్టరీ సూపర్వైజర్ గా నటిస్తున్నారు బాబి కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ చిరంజీవికి కూతురుగా నటిస్తోంది. నివేదా పేతురాజు , సునీల్ ,గెటప్ శ్రీను, రచిత రామ్ లాంటి సెలబ్రిటీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా.. మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.