కడప జిల్లా పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపు చేయడానికి గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపారు. పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులపై టీడీపీ కవింపు చర్యలకు పాల్పడినట్టు సమాచారం.
రెండు పార్టీల కార్యకర్తల నడుమ ఆందోళన చెలరేగడంతో ఒకసారిగా అక్కడ రణరంగంగా మారింది. దీంతో పులివెందల నామినేషన్ కేంద్రం వద్ద భారీగా పోలీసు మొహరించారు. ఇరు వర్గాలను చదర గొట్టేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఇంకా పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది.
నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద భారీగా టీడీపీ, వైసీపీ శ్రేణులు మోహరించారు. దీంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులపై టీడీపీ కవింపు చర్యలు చేస్తున్నట్టు సమాచారం. ఇరు వర్గాలను చదర గొట్టేందుకు బాష్పవాయు పోలీసులు ప్రయోగించారు