ఎన్నికలు అంటే ఆ మజాయే వేరు. ఎందుకంటే నెల రోజుల ముందు నుంచి ప్రధాన పార్టీల్లో సందడి నెలకుంటుంది. మాటల యుద్ధంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ వైసీపీలో ఆ జోష్ కరువైందా? ఆ పార్టీ దిగువ స్థాయి కేడర్ ఊగిసలాడుతోందా? ఏపీ నుంచి వైసీపీ క్రమంగా కనుమరుగు అవుతుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని వైసీపీ నేతలు, కేడర్ భావించింది. చీటికిమాటికి జగన్ బెంగుళూరుకి వెళ్లడం, వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఏపీకి వస్తున్నారు. తాడేపల్లికి వచ్చి ఒకటి లేదా రెండుసార్లు నేతలతో సమావేశాలు పెడుతున్నారు. జరుగుతున్న.. జరగబోతున్న పరిణామాలను అధినేత జగన్ ముందుగానే పసిగట్టారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా చూడాలని తన వంతు ప్రయత్నాలు చేశారు. హైకోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది వైసీపీ. లోకల్ బాడీ ఎన్నికలను నిలుపుదల చేయాలని ప్లాన్ చేసింది.
న్యాయస్థానాల తీర్పు మరోలా రావడంతో ఆపేందుకు ఇంకా కొత్తదారులు వెతుకుతోంది. తాజాగా గడిచిన మూడు రోజులుగా ఏపీలో టీడీపీ-జనసేన మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావించారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఆ స్థాయికి వెళ్లింది. ఏపీలో ఏ ఇద్దరు లేదా ముగ్గురు కలిసినా.. టీడీపీ వర్సె్స్ జనసేన అన్న మాదిరిగా చర్చించుకున్నారు. ఈ రెండు పార్టీల బలబలాల గురించి మాట్లాడుకున్నారు. ప్రతిపక్షం వైసీపీ గురించి ఓ ఒక్కరూ నోరు మెదపలేదు. ఆ పార్టీపై మాట్లాడటానికి ఏ ఒక్కరూ ఇష్టపడలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చివరకు వైసీపీ మీడియా, వారి మద్దతు మీడియా కూడా ఆ దారిలో పయనించింది. స్థానిక ఎన్నికల్లో తమ సామర్థ్యం గురించి ఆ పార్టీ నేతలు ఎక్కడా మాట్లాడిన సందర్భం కనిపించలేదు. ఇంతకీ ఏపీలోని ప్రతిపక్షం ఉందా? అంటూ అనుకోవడం కనిపించింది. చివరకు జనసేన బలానికి తగిన సీట్లు ఇవ్వలేదని వైసీపీ నేతల్లో కొందరు ఆవేదన చెందారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా టీడీపీ ఆటలు జనసేన వద్ద ఉడకవని చెప్పుకొచ్చారు. ఒకవేళ సీట్ల సర్దుబాటు కుదరక కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేసినా, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితులు వైసీపీలో కనిపించలేదు.
సోషల్ మీడియా ద్వారా జనసేన తరపున టీడీపీని ప్రశ్నించే ప్రయత్నం చేసింది. ఈ పరిస్థితి గమనించిన కొందరు వైసీపీ నేతలు.. అయితే టీడీపీ లేకుంటే జనసేన వైపు మొగ్గుచూపడం మొదలుపెట్టారు. మరోవైపు బుధవారం జగన్కు సంబంధించి కేసుల గురించి ఐదు పరిణామాలు జరగడంతో చివరకు నేతలు, కేడర్ కూడా డీలా పడిపోయినట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే ఏపీ నుంచి మెల్లగా వైసీపీ కనుమరుగు అవ్వడం ఖాయమనే వాదన అప్పుడే మొదలైంది.