‘ది ప్యారడైజ్’ కోసం నాని తీవ్రంగా శ్రమించారు.. యాక్షన్‌పై రామ్-లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

నేచురల్ స్టార్ నాని తన 18 ఏళ్ల సినీ కెరీర్‌లో ‘ది ప్యారడైజ్’ కోసం అత్యంత కష్టపడ్డానని తెలిపారు. ఈ సినిమా తనను శారీరకంగా, మానసికంగా ఎంతో పరీక్షించిందని నాని చెప్పిన మాటలు మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఈ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది.

తెలంగాణ అండర్‌గ్రౌండ్ నేపథ్యంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ సినిమా యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాని తీవ్రంగా శ్రమించిన తీరు, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం తీసుకున్న జాగ్రత్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.