న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ టోటల్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. దీంతో చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి దృష్టి సారించింది.
సినిమా ఫస్టాఫ్‌కు సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు సెకండాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎడిటింగ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి కీలక విభాగాల్లో ప్రత్యేక బృందాలు ఏకకాలంలో పనిచేస్తున్నట్లు సమాచారం. సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ఎలాంటి విరామం లేకుండా పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది. ‘ది ప్యారడైజ్’ను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్‌కు ఒక రోజు ముందే వరల్డ్‌వైడ్ ప్రీమియర్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తవడంతో సినిమా కోసం నాని అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి.