అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన 51 ఏళ్ల స్పిన్నర్ జోయాన్నే హిక్స్ అద్భుత ఘనత సాధించారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అత్యంత వయసైన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. దీంతో ఆమె పేరు క్రికెట్ రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కింది.
జోయాన్నే హిక్స్ సాధించిన ఈ ఘనతతో ఏకంగా 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డు బద్దలైంది. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న రికార్డును 51 ఏళ్ల వయసులో ఆమె అధిగమించడం విశేషంగా మారింది. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేశారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వికెట్లు తీయడం ఎంతో ప్రత్యేకమైన ఘనత కాగా.. 51 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించడం మరింత అరుదైన విషయం. జోయాన్నే హిక్స్ రికార్డు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆమె సాధించిన ఈ అద్భుత ప్రదర్శనకు అభిమానులు, క్రికెట్ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.