కింగ్ 100 ఫస్ట్ గ్లింప్స్‌పై ఆసక్తికర అప్‌డేట్

కింగ్ నాగార్జున అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన 100వ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న నాగార్జున.. ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘కింగ్ 100’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న ‘కింగ్ 100’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి నాగార్జున బర్త్‌డే వేడుకలు అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారనున్నాయి. గ్లింప్స్‌తో పాటు సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌పై కూడా అదే రోజు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరో రెండు రోజుల్లో ఈ సర్‌ప్రైజ్‌ను అభిమానులు ఆస్వాదించబోతుండటంతో అక్కినేని అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నాగార్జున 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. అయితే గ్లింప్స్, టైటిల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.