Huawei Pura X View.. ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ ఫోన్!

హువావే నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. Huawei Pura X View పేరుతో విడుదల కానున్న ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంటోంది. వినూత్న డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు హువావే వెల్లడించింది.

కంటెంట్ చూడటం, పుస్తకాలు చదవడం, గేమింగ్, ప్రొడక్టివిటీ వంటి విభిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని Pura X Viewను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. సాధారణ స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా విస్తృతమైన స్క్రీన్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ డివైజ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

వైడ్ స్క్రీన్ ఫార్మాట్, ఆధునిక డిజైన్‌తో వస్తున్న Huawei Pura X View స్మార్ట్‌ఫోన్‌పై టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, మార్కెట్లో విడుదల తేదీ వంటి వివరాలను కంపెనీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.