ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తీవ్ర రద్దీ ఏర్పడి, ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనతో భక్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా భక్తులు గాయపడినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు.
ప్రస్తుతం గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా, భక్తుల భద్రత కోసం అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.