అల్లుడిపై ఉన్న అక్రమ సంబంధం మోజుతో కట్టుకున్న భర్తనే అత్త దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కూతురి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హతమార్చాలని పథకం పన్నింది. రాత్రి సమయంలో నిద్రిస్తున్న భర్తపై దాడి చేసి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసింది.
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితురాలు.. ముందుగా భర్త మర్మాంగాలపై తీవ్రంగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టింది. ఆ తర్వాత ఊపిరి ఆడకుండా చేసి హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
మృతుడి భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. విచారణలో నిందితురాలు నేరం అంగీకరించడంతో పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు. అక్రమ సంబంధం కోసం సొంత భర్తను బలిగొన్న ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.