కొండగట్టు హనుమాన్ జయంతోత్సవాలకు మంత్రికి ఆహ్వానం.

తేది: 04-05-2026, TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఈఓ అంజనారెడ్డి హైదరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలసి ఆహ్వాన పత్రికను అందజేసి హనుమాన్ జయంతి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాలను ఈ నెల 10 నుంచి 12 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, వేదపండితులు పెద్దన్ శర్మ, సూపరింటెండెంట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *