గ్రామ హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు.

తేది:01-05-2026, రాజన్న సిరిసిల్ల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ దొబ్బల ప్రసాద్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: విలాసాగర్ గ్రామంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య హాజరై జెండా ఆవిష్కరణ చేసి హమాలీ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర అమూల్యమని,దేశాభివృద్ధికి వారి శ్రమే పునాది అని అన్నారు,కార్మికుల సంక్షేమం,హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు,హమాలీ కార్మికుల సేవలను కొనియాడుతూ,వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు,కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షుడు ఆకుల అంజయ్య, సంఘ సభ్యులు,గ్రామ పెద్దలు,ప్రజాప్రతినిధులు పాల్గొని మేడే వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *