డబ్బా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ల సందడి.

తేది:15-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా : యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని డబ్బా గ్రామ ఉప సర్పంచ్ రాపల్లి మహేష్, మాజీ ఉప సర్పంచ్ భూస రాజేశ్వర్ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో తోకల చిన్న వెంకన్న స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ టోర్నమెంట్‌లో మంగళవారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు.ఫైనల్ పోటీలో పోట్టి నవీన్ జట్టు విజయం సాధించగా వారికి రూ.2016 నగదు బహుమతి అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన భూస రమేష్ జట్టుకు రూ.1016 నగదు బహుమతి అందించారు. టోర్నమెంట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తోకల ప్రశాంత్‌కు రూ.516 నగదు బహుమతిని వెంకన్న కుమారుడు తోకల శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాపల్లి మహేష్, మాజీ ఉప సర్పంచ్ భూస రాజేశ్వర్, పుప్పాల మహేష్ అందజేశారు.గ్రామ విడిసి సభ్యులు పుప్పాల గజేందర్, బైండ్ల సంజీవ్ ప్రశాంత్‌ను నగదు బహుమతితో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తోకల డేవిడ్, డాక్టర్ శ్రీధర్, బోండ్ల మహేష్, దేవీలాల్ నరేష్, వినిత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *