పెద్ది సినిమాలో సాయి కుమార్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)ప్రస్తుతం బుచ్చిబాబు (Bucchi Babu)దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. అయితే ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమా విడుదల అవతుంది అంటూ చిత్ర బృందం ప్రకటించారు కానీ ఈ సినిమా 30వ తేదీ కూడా విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది ఈ సాంగ్ కోసం హీరోయిన్లు కూడా ఎవరు ఫైనల్ కాలేదు తద్వారా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

పెద్ది సినిమాలో సాయికుమార్..

ఇక ఈ సినిమా జూన్ నెలలో రావచ్చని వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇప్పటికే సీనియర్ నటుడు జగపతిబాబు అప్పలసూరి అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈయనతో పాటు మరొక సీనియర్ స్టార్ హీరో సాయికుమార్ (Sai Kumar)కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుంది. తాజాగా ఒక అభిమాని సాయికుమార్ తో ఒక సెల్ఫీ వీడియో దిగగా ఇందులో సాయికుమార్ పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. అభిమాని సర్ పెద్ది సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వండి అంటూ అడగడంతో సాయికుమార్ మాట్లాడుతూ..

 

వాడి కంట్లో భయం లేదు.. ఒంట్లో బెదురు లేదు..

పెద్ద సినిమా కోసం నేను కూడా నీలాగే వెయిట్ చేస్తున్నాను. ఒక సాంగ్ షూటింగ్ అవ్వాల్సి ఉంది చరణ్ అదరగొట్టారని అర్థమవుతుంది, క్రికెట్ అదర కొట్టేసాడు. వెయిటింగ్ ఫర్ పెద్ది అంటూనే ఎవడు సినిమాలోని డైలాగు చెప్పాడు. వాడి కంట్లో భయం లేదు.. ఒంట్లో బెదురు లేదు.. దెబ్బకు తిరుగులేదు ఎవడు.. వాడే రామ్ చరణ్ అంటూ ఎవడు సినిమాలో డైలాగుతో సాయికుమార్ అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇంకా పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్ కాలేదని స్పష్టం అవుతుంది.

 

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ప్రమోషన్లను నిర్వహించడం కోసం చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అనుకున్న విధంగానే ఈ సినిమా వాయిదా పడుతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదల గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వస్తున్నా చిత్ర బృందం మాత్రం ఎక్కడా స్పందించలేదు. ఇక ఈ సినిమాలో సాయికుమార్ కూడా భాగం కావడంతో దాదాపు పది సంవత్సరాల తర్వాత సాయికుమార్ చరణ్ సినిమాలో కనిపించబోతున్నారని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో సాయికుమార్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *