తేది:13-03- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం సిద్ధపూర్
గ్రామాల్లో మహిళల సాధికారతకు మరియు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, నేడు సిద్ధపూర్ గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు గ్రామంలో నీటి ఎద్దడిని నివారించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావి పూజా కార్యక్రమం కూడా శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై, భూమి పూజలో పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపిటిసి ఆఫీస్ , సిద్ధపూర్ గ్రామ సర్పంచ్ మరియు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా హనుమంతరావు పాటిల్ మాట్లాడుతూ.. “మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ మహిళా శక్తి భవనం గ్రామంలోని మహిళలందరికీ ఒక వేదికగా మారుతుందని, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని” పేర్కొన్నారు. అలాగే, కొత్త బోరు బావి ఏర్పాటుతో గ్రామస్థులకు తాగునీటి సమస్య తీరనుందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.