తేది :3-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా : అల్లీపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. బండారు ముత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పారాయణంలో గ్రామానికి చెందిన ,మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చాలీసా పఠనంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ కచేరి కమిటీ సభ్యులు మరియు 8వ వార్డ్ మెంబెర్ అనుమల్ల రాజ్ కుమార్, శేఖర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.