తేది:03-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో హోలీ పండుగ సందడి నెలకొంది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఆనందంగా వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్నేహపూర్వక వాతావరణంలో రంగులు చల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు. విధుల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే పోలీసు సిబ్బంది, ఈ ప్రత్యేక దినాన పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ శైలేందర్, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
హోలీ వేడుకలు పోలీసు కుటుంబంలో ఐక్యత, స్నేహభావాన్ని మరింత బలపరిచాయి.