నల్లగొండలో BC SC ST సంఘాల నిరసన – రెండు నెలల పసిబిడ్డ హత్యపై కఠిన చర్యల డిమాండ్.

తేది: 26-02-2026 నల్గొండ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ కానుగుల స్వామి.

నల్గొండ జిల్లా : నల్గొండ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో గురువారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా రెండు నెలల పసిబిడ్డ హత్య ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్, రచయిత ఐదారి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘటన వివరాలను వెల్లడిస్తూ, జాతరలో దర్శనానికి వెళ్లిన గణేష్ కుటుంబంపై కులవివక్షతో దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడి పసిబిడ్డ ప్రాణాలు తీశారని ఆరోపించారు.
ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితుల్లో కేవలం నలుగురిని మాత్రమే అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ, మిగిలిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ అయితరాజు లక్ష్మణ్, సోమనబోయిన వెంకన్న, కారింగ్ శేఖర్, బీసం శ్రీనివాస్, మేడి నరసింహ, ఈదులకంటి నగేష్, అనుముల దేవి, లింగంపల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *