తేది:31-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ తుకారం అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం కళాశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువులే కాకుండా ఆట పోటీల్లో పాల్గొనడం ద్వారా , శరీర దారుఢ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు, కబడ్డీ, వాలీబాల్ కోకో, క్యారం తో పాటు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల కళాశాల అధ్యాపకులు శ్యామ్ రావు, రవికుమార్, రవీందర్, శివ కుమార్, నరసింహారెడ్డి ,శంకర్, స్రవంతి, దత్తు, ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.