తేది: 22-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యసందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి శాస్త్రవేత్తలతో సమావేశమై, వ్యవసాయ పరిశోధనల ప్రగతి, రైతులకు అందిస్తున్న సాంకేతిక సహాయం, కొత్త పంటల అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా పత్తి, వరి వంటి అవసరమైన పంటల సాగు వివరాలు, పంటలు లాభసాటిగా ఉండేందుకుఅనుసరించాల్సిన పద్ధతులపై శాస్త్రవేత్తల నుంచి వివరాలుతెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, ఈప్రాంతంలోని రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలను మరింత ప్రయోజనకరంగా రూపొందించాలని, శాస్త్రవేత్తలు–రైతుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని సూచించారు. వ్యవసాయ రంగం బలోపేతం కావాలంటే పరిశోధన ఫలితాలు నేరుగా రైతుల వరకు చేరాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. అలాగే వరంగల్లోని టెక్స్టైల్ రంగానికి అనుసంధానంగా ఇక్కడ పండించిన పత్తిని వినియోగించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉద్యానవన పంటలైన మిర్చి, మామిడి, పసుపు, పత్తి తదితర పంటలపై పరిశోధనలు వరంగల్ ప్రాంతంలో జరిగేలా ప్రతిపాదనలు అందిస్తే, వాటిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అమలు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పండిస్తున్న పత్తి, వరి అవశేషాలను తగలబెట్టకుండా నేలలోనే కలియదున్ని సేంద్రియ ఎరువుగా మార్చే విధంగా షెడ్డర్ తో పాటు మల్చర్ లను రైతులకు అందుబాటులో తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని ఎంపీ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఉమా రెడ్డి, అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపల్ రవీందర్ నాయక్, శాస్త్రవేత్తలు, మాజీ కార్పొరేటర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.