బాల్యవివాహాలు అరికట్టాలి.

తేది:22- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని గ్రామ సర్పంచ్ హరికృష్ణ, అంగన్వాడి సూపర్వైజర్ నాగమణి లు అన్నారు. మండల పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామంలో గురువారం (ఏ ఎల్ ఎం ఎస్ సి) సమావేశంలో గ్రామ పిల్లల సంరక్షణ కమిటీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాల నివారణ, బాల కార్మికత్వం అరికట్టడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. పిల్లల శ్రేయస్సు కోసం గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు అందరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాలలో ఆయా శాఖలతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు నర్సింలు, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు, పెద్దలు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *