గుంతలు పడి ఒకపక్క SRSP కెనాల్ పైకప్పు కూలి డేంజర్ గా మారిన జగిత్యాల ధర్మపురి బైపాస్ గొల్లపల్లి రోడ్డు చౌరస్తా.

తేది:22/01/2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ రాచమల్ల సుభాష్.

జగిత్యాల పట్టణంలో అధ్వానంగా ఉన్న రోడ్లు జగిత్యాల పాత బస్టాండ్ నుండి గొల్లపల్లి ధర్మపురి వెళ్లే బైపాస్ చౌరస్తాలో ఎప్పుడు గుంంతలు పడుతూనే ఉంటాయి. వాటిని తుతు మంత్రంగా కంటి తుడుపు చర్యగా మట్టి పోయడం అధికారులు పనిగా పెట్టుకున్నట్టుగా ఉంది.బైపాస్ రోడ్డున పెద్దపెద్ద లారీలు ట్రక్కులు టర్న్ తీసుకొని ధర్మపురి వైపు వెళ్లాలసిన పరిస్థితి ఒకపక్క గుంతలు పడ్డ రోడ్డును క్రాస్ చేయాలి అంటే లోడుతో ఉన్న పెద్ద లారీలు టర్న్చే సుకోవాలంటే డ్రైవర్ ఇబ్బంది పడి టర్న్ చేసుకోవడం, వచ్చి పోయే వాహనాలకు అడ్డంకిగా ఉంది. అదేరోడ్డును ఆనుకోని SRSP కెనాల్ అండర్ పైపులైన్ ఛాంబర్ పగిలిపోయి ఉంది. ఒక పక్కన ప్రమాదకరంగా మారింది దాన్నిపట్టించుకోవాట్లేదని అంటున్నారు. దానిపైన పాడైన ఇనుప జాలిలు వేసి చేతు దులుపుకున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇంకో పక్క గొల్లపల్లి నుండి వచ్చే వాహనాలు హై లెవల్ రాంప్ లాగా ఉన్న రోడ్డును స్పిడుగా స్పిడుగా ఎక్కిస్తేనే వాహనం ముందుకు వెళ్లే పరిస్థితి ఆ దారిన వచ్చిపోయే వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు లేని రోడ్డు రూల్స్ పాటించని వాహనందారులను చూస్తుంటే కాలినడకన వచ్చి పోయేవారికి మరోపక్క ద్విచక్ర వాహనాలు రోడ్డును దాటాలంటే ఇబ్బందిగా మారింది కావున సంబంధిత రోడ్డు నిర్వహణ అధికారులు అప్రమత్తమై త్వరగా, ప్రమాదకరంగా మారిన గొల్లపల్లి ధర్మపురి క్రాస్ చేసే చౌరాస్తాను సందర్శించి, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసినదిగా ప్రజలు, వాహనదారులు కోరుచున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *