తేది:22- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
రాయికల్ మండలo రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలోని రాయికల్ కు కూతవేటు దూరంలో, రాయికల్ కు నడిబొడ్డున ఉన్న పశు వైద్యశాల కేంద్రం రాత్రి వేళల్లో మందు బాబులకు అడ్డా మారింది.దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ సాయంత్రం తర్వాత కొంతమంది పశు వైద్యశాల ప్రాంగణంలో చేరి మద్యం సేవించడం, అక్కడే బాటిల్స్ నీ పగల గొట్టడం, చెత్త పడవేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతుంది. రాత్రి వేళల్లో రాయికల్ పోలీస్ అధికారులు పెట్రోలింగ్ చెయ్యాలని,పహారా ఏర్పాటు చేసి ప్రభుత్వం ,ప్రైవేట్ కార్యలయలకు ఇలాంటివి జరగకుండా అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.