గిరిజన ఉప ప్రణాళిక వేసవి నువ్వు పంట సాగులో యాజమాన్యం రైతు శిక్షణ శిబిరం.

తేది:22-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గురువారం రోజున ఎల్ జి ఎంఆర్ ఎఫ్ పి సి వారి ఆధ్వర్యంలో గిరిజన ఉప ప్రణాళిక వేసవి నువ్వు పంట సాగులో యజమాన్యం రైతు శిక్షణ శిబిరం నిర్వహించారు.. రైతులు గతంలో సాగుచేసిన నువ్వు పంటలకు ఎదురైన సమస్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త సంధ్య కిషోర్, తెగుళ్ళ విభాగం శాస్త్రవేత్త సుమలత, కీటక విభాగం శాస్త్రవేత్త స్వాతి లు రైతులకు నువ్వు పంటలు ఎలా వెయ్యాలో, కాండం, ఆకుల మీద వచ్చే తెగుళ్ల గురించి, మరియు క్రిమి కీటకాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి, మాజీ సర్పంచ్ మరిపెళ్లి నారాయణ గౌడ్, సామల లావణ్య వేణు, మాజీ సింగిల్ విండో చైర్మన్లు సుర కంటి రాజారెడ్డి, కాటిపెళ్లి నారాయణరెడ్డి, ఎఫ్ పి సి చైర్మన్ గడ్డం రాజేందర్ రెడ్డి, రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *