తేది:13-01-2026 TSLAWNEWS నిజామాబాద్ జిల్లా,బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ కేశపురం సుమన్.
నిజామాబాద్ జిల్లా, వేల్పూర్: వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ లో సర్పంచ్ కోనపత్రి సుజాత నరేందర్ ఆధ్వర్యంలోమంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.సర్పంచ్ కోనపత్రి సుజాత నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ వైభవం,సంస్కృతి,సాంప్రదాయాలను నేటితరానికి తెలియాలని ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రామ యువతులు ఎంతో ఆసక్తితో పాల్గొని రంగవల్లులు వేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోనపత్రి సుజాత,ఉప సర్పంచ్ నరేందర్,వార్డు సభ్యులు,యువతులు ప్రజలు పాల్గొన్నారు.