డివైఎఫ్ఐ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను విజయవంతం చేయండి-డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ యువతకు పిలుపు.

తేది:13-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: ఈరోజు సదాశివపేటలోని డివైఎఫ్ఐ కార్యాలయంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్లను డివైఎఫ్ఐ నేతలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతు:
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువత, విద్యార్థులు, మహిళల కోసం వివిధ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగా ఈ నెల 15-01-2026 (గురువారం) నాడు ఉదయం 9 గంటలకు, సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో డివైఎఫ్ఐ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ఈ టోర్నమెంట్‌లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన యువ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ట్రోఫీలు అందజేయబడతాయని తెలిపారు.
టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన క్రీడాకారులు 8317607388, 8886742414 నంబర్లకు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల యువకులు, క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. నేటి యువత మత్తు పదార్థాలను వీడి, క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ధ్యాన్చంద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, ఆలమీన్ ప్రిన్సిపల్ ఎం.ఏ. గని, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సంగమేష్, కోనాపూర్ గ్రామస్తులు సద్దాం, దర్శన్, అరుణ్, వినోద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *