అల్లాదుర్గం మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభించిన- గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.

తేది:12- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండలం వెంకట్రావు పేట్ గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సోమవారం పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో ఉచిత పశువైద్య శిబిరాని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ ఉచిత పశు వైద్య శిబిరాన్ని పాడి రైతులకు గ్రామ ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అల్లాదుర్గం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ రాజు మాట్లాడుతూ పాడి పశువులలో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించుకొని సకాలంలో చూలు కట్టేలా చూసుకోవాలన్నారు. లేగ దూడలకు నట్టల నివారణ ముందు తాగించు కోవాలి పాడి రైతులకు తెలిపారు. మెదక్ జిల్లా గోపాలమిత్ర సూపర్వైజర్ యం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పాడి పశువు ఎద లక్షణాలను గుర్తించి గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్వదారణ చేయించుకోవాలని తెలియజేశారు కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ జి మహేందర్ రెడ్డి సిబ్బంది ఏ. పాపయ్య గోపాల మిత్ర బి. భూమయ్య గ్రామ ప్రజలు మరియు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *