తేది:8- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ బి పాపయ్య చారి.
మెదక్ జిల్లా : మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ లో భాగంగా గురువారం గ్రామ సర్పంచ్ సౌమ్య సురేష్ గౌడ్, మత్స్యశాఖ అధ్యక్షులు భూమయ్య కలిసి మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని పెద్ద పటేల్ చెరువు, లో ప్రభుత్వం నుండి వచ్చిన 36.460 చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ఉచిత చేప పిల్లల పథకం మత్స్య కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ చాప పిల్లల ద్వారా కార్మికులకు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని, ఈ పథకాన్ని మత్స్య కార్మికులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్ బాలాజీ, ఫిల్డ్ మెన్ శేఖర్, గ్రామ కార్యదర్శి ప్రభాకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాములు, నాయకులు సురేష్ గౌడ్, గొండ్లసాయిలు.దశరథ్, సుధాకర్, యాదయ్య, రేవంత్ తదితరులున్నారు.