తేది:27-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సిహెచ్ సత్యనారాయణ.
సంగారెడ్డి జిల్లా : అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలం లక్ష్మీపూర్ గ్రామం లో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ లక్ష్మీపూర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాల కంటే ప్రస్తుతం లక్ష్మీపూర్ గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతున్నాయని ఇట్టి విషయంలో సంబంధిత అధికారులు ఎక్సైజ్ శాఖ వారు తగిన చర్య తీసుకుని మద్యానికి లక్ష్మీపూర్ గ్రామ ప్రజలు బానిసలు కాకుండా ఉండే విధంగా చూడాలంటే మద్యం బెల్ట్ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇట్టి విషయంలో సంబంధిత శాఖ సీఐ గారు సరిగ్గా స్పందించకుండా వ్యవహరిస్తున్నారని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేశారు.