గ్రామాభివృద్ధికి సహకరించాలని తహసీల్దార్ ఎస్ఐ ని కలిసి విజ్ఞప్తి చేసిన-సర్పంచ్ రాధికా శ్రీనివాస్.

తేదీ :24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS
గణపురం మండలం రిపోర్టర్ దీపక్.

నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు బుధవారం గణపురం తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ రెండవ ఎస్ఐ గైకవాడ అమూల్య లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరారు కలిసికట్టుగా పనిచేసి గణపురం పంచాయతీని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేలా సహాయ సహకారాలు అంద జేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *