తేది:24-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగని కలెక్టర్ పేర్కొన్నారు.
ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రేమను పంచుకోవడం, సేవాభావంతో మానవత్వాన్ని కాపాడుకోవడం ఎలా అన్న విషయాలను క్రీస్తు బోధనలు తెలియచేస్తాయని తెలిపారు.జిల్లా ప్రజలంతా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని, పరస్పర సహాయార్దంతో, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, ప్రజలకు ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.