అమృత్ 2.O పథకం లోని పనులను వేగవంతం చేయాలి-జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్.

తేది:24-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాలజిల్లా:మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం క్రింద నిధులు మంజూరు చేయగా ఈ పథకం కింద వాటర్ ట్యాంక్లు, వాటర్ సంప్, పైప్ లైన్లు నిర్మిస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ కోరుట్ల మున్సిపల్ పరిధిలో అమృత్ 2.O పథకం క్రింద నిర్మిస్తున్న పనులను మరియు లే అవుట్, బయో మైనింగ్ లో భాగంగా డంప్ యార్డులను పరిశీలించారు.
ఈ పరిశీలనలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఈఈ, టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *