విద్యార్థులకు ఆత్మరక్షణ కొరకు కరాటే అవసరం-ప్రిన్సిపల్ కే సత్యయ్య.

తేది:23-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వడ్ల పాపయ్య చారి.

మెదక్ జిల్లా:అల్లాదుర్గం.విద్యార్థులకు ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే సత్యయ్య అన్నారు. అల్లాదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రేణుక రెడ్డి సౌజన్యం తో ప్రభుత్వ జూనియర్ కళాశాల అల్లాదుర్గం విద్యార్థులకు కరాటే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు, కళాశాల ఆవరణలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య శిక్షకులుగా జాతీయ కరాటే ఛాంపియన్ బాగయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు చదువుతోపాటు ఆత్మ రక్షణ కొరకు, జీవితంలో తనను తాను సంరక్షించుకొని ధైర్యం పొందే విధంగా తయారు చేయాలని సంకల్పంతో కరాటే శిక్షణ ముక్యంగా విద్యార్థినిల కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం వారం లో ప్రతి బుధవారం, శనివారం, లలో కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి శిక్షకులు బాగయ్య గారికి, తల్లిదండ్రుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తుకారం, శ్యామ్ రావు, రవికుమార్ ,రవీందర్, నరసింహారెడ్డి, శివకుమార్,శంకర్ తో పాటు విద్యార్థిని, విద్యార్థులు లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *