కాజిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్, ఉప సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారోత్సవం.

తేది :22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: కాజిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ లను గ్రామ పంచాయతీ సెక్రెటరీ లిఖిత సుమన్ గారు మరియు ఏఈఓ ప్రతిభ గారు శాలువాతో సత్కరించి వీరందరికీ అభినందనలు తెలియజేశారు అలాగే గ్రామంలో జరగబోయే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని ఆమె సూచించారు ప్రతి సమస్యలోనూ ముందుండి నడిపించాలని గ్రామ సర్పంచి గారిని సలహాలు సూచనలు తెలియజేశారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని వివరించారు,
సర్పంచ్ నరసింహులు గారు మాట్లాడుతూ ఉప సర్పంచ్ తలారి శ్రీనివాస్ గారితో కలిసి గ్రామంలో జరగబోయేటటువంటి అని పనుల గురించి మేము ముందుండి నడిపిస్తామని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతామని ఎల్లవేళలాగ్రామంలో అందుబాటులో ఉండి ప్రజల కొరకు ప్రజా సమస్యల కొరకు పోరాడుతామని చెప్పడం జరిగింది, ప్రతి నెలకి గ్రామ సభలు నిర్వహించి గ్రామ పెద్దల ఫిర్యాదుల మేరకు వాటిపై దృష్టి పెట్టి పని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఇందులో వార్డు మెంబర్స్ సభ్యులుగా కొత్తగా నియమితులైన అభ్యర్థులు,
విశ్వనాథం బిక్షపతి, దేవాజి గారి మోహనా చారి, మహంకాళి శ్రీకాంత్ యాదవ్, కొంగరి పెంటయ్య, దూదేకుల మోసిన్, వీరబోయిన లావణ్య, తలారి మంజుల, మిర్జాపల్లి లావణ్య, జంగిటి రామవ్వ, మరియు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *