తేది:21-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
ఇటీవల జగిత్యాల జిల్లా నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కరీంనగర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.