

తేదీ: 21-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
పటాన్చెరు: పటాన్చెరు కూరగాయల మార్కెట్లో ప్రస్తుతం కూరగాయల ధరలు సాధారణంగా ఉండే ధరల కంటే గణనీయంగా తగ్గాయని మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాతల మల్లేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యంగా పచ్చడులు, జామ్‌లు మరియు ఇతర దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాల తయారీకి ఇది ఎంతో అనుకూలమైన సమయమని పేర్కొన్నారు. హోల్‌సేల్‌లో కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరలకు కూరగాయలు లభించే అవకాశం ఉందని ఆయన వివరించారు.
రైతులు తమ స్వయంగా పండించిన కూరగాయలను నేరుగా ఈ మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించడం వల్ల మధ్యవర్తులు లేకుండా వినియోగదారులకు తక్కువ ధరలకు సరుకులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. గత వారం సగటు ధరల ప్రకారం మిర్చి కిలో రూ.40, టమాటా రూ.25, సొరకాయ రూ.20, క్యారెట్ రూ.30, వంకాయ రూ.30, బీట్రూట్ రూ.20, కీరా రూ.20 చొప్పున విక్రయమైనట్లు వెల్లడించారు.
ప్రతి గురువారం రిటైల్ విక్రయాలు నిర్వహిస్తామని, ఆ రోజు ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని మల్లేష్ గారు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వినియోగదారులు ఈ మార్కెట్‌కు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.