ఇస్నాపూర్ ఎక్స్ రోడ్డులో వ్యక్తి అదృశ్యం.

తేదీ:21-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

పటాన్‌చెరు (ఇస్నాపూర్): సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్.కె. మార్ట్ సమీపంలో నివాసం ఉంటున్న మొయ్యిళ్ళ ఈశ్వరరావు (49) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే, ఇస్నాపూర్ ఎక్స్ రోడ్‌లోని హెచ్.నెంబర్ 6-70/3లో నివాసం ఉంటున్న ఈశ్వరరావు శుక్రవారం (డిసెంబర్ 19, 2025) రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆయన భార్య చంద్రవతి తన చిన్న కుమారుడిని ట్యూషన్ నుంచి తీసుకురావడానికి బయటకు వెళ్లారు. కొద్దిసేపటికి ఇంటికి తిరిగి వచ్చిన ఆమె భర్త ఇంట్లో లేకపోవడంతో ఆందోళనకు గురై చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.
దీంతో బాధితురాలు చంద్రవతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అదృశ్యమైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
గుర్తుపట్టేందుకు వివరాలు:
పేరు: మొయ్యిళ్ళ ఈశ్వరరావు
తండ్రి పేరు: సుబ్బారావు
వయస్సు: 49 సంవత్సరాలు
ఎత్తు: సుమారు 5.2 అడుగులు
రంగు: గోధుమ ఛాయ
దుస్తులు: బ్లూ రంగు షర్ట్, బ్లాక్ ప్యాంట్, బూడిద రంగు స్వెటర్
కుటుంబ సభ్యుల విజ్ఞప్తి:
పైన పేర్కొన్న వివరాలకు సరిపోలే వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని వారు కోరుతున్నారు. తమ భర్తను కనుగొని న్యాయం చేయాలని బాధితురాలు చంద్రవతి వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *