
వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి కొత్త ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్‌గా యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. కె. రమేష్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం శుక్రవారం అధికారికంగా అమలులోకి వచ్చింది.డా. రమేష్ రెడ్డి 2017 నుండి 2023 వరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా పనిచేసి, కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖకు కీలక సేవలందించారు. అలాగే, నిలౌఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ నియామకం యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ డా. నందకుమార్ రెడ్డి అక్రమ పాసింగ్ ఆరోపణలు, విజిలెన్స్ దర్యాప్తు కారణంగా రాజీనామా చేయడంతో డా. రమేష్ రెడ్డి నియమించారు అదేవిధంగా విద్యార్థుల ప్రయోజనాన్ని ముందుగా భావిస్తూ, ర్యాగింగ్‌పై యూనివర్సిటీ వద్ద కఠినంగా నిషేధం విధించబడిందని తెలిపారు. విద్యార్థులకు సురక్షిత, సహాయక వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే, కాలేజీ ఫౌండ్స్ యొక్క సరైన వినియోగాన్ని, సమర్థవంతమైన నిర్వహణను పాటిస్తూ విద్యాసంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ మార్పులు యూనివర్సిటీ పరిపాలనలో కొత్త దిశ తీసుకువచ్చి, విద్యార్థులు మరియు సిబ్బందికి లాభదాయకంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసారు.