శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కొత్త మలుపులు..!

శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగు తోంది. తన భార్య వాణి చేసిన కామెంట్స్‌పై కౌంటరిచ్చారు ఆమె భర్త శ్రీనివాస. అంతేకాదు ఈ పంచాయతీ అంతా వైసీపీ అధిష్టానానికి తెలుసని, హైకమాండ్‌ని బ్లాక్ మెయిల్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో దువ్వాడ శ్రీను-వాణి వ్యవహారం మరింత ముదిరిపాకాన పడింది.

 

శనివారం ఉదయం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసలు గుట్టు బయటపెట్టారు. తన ఫ్యామిలీ తనపై దాడి చేస్తుందని కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. తన భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువన్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ పంచాయతీ వైసీపీ అధిష్టానం వద్దకు వెళ్లిందన్నారు.

 

టెక్కలి టికెట్ విషయంలో హైకమాండ్‌తో నాలుగు సిట్టింగులు జరిగాయన్నారు. టికెట్ తనకు ఇవ్వాల్సిం దేనని వాణి డిమాండ్ చేసిందన్నారు. శ్రీను నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఒత్తిడి చేసిందన్నారు . తాను చెప్పినవి చేయకుంటే.. ఉరి వేసుకుని చస్తానంటూ పార్టీ హైకమాండ్‌ను వాణి బ్లాక్ మెయిల్ చేసిందని దుయ్యబట్టారు.

 

కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలన్న దువ్వాడ శ్రీనివాస్, కుటుంబమే తనపై దాడి చేస్తోందని ఆవేదక వ్యక్తంచేశారు. ఓ కూతురికి పెళ్లి చేశాను.. మరో కూతురుకి మ్యారేజ్ చేయాల్సి ఉందన్నారు. మైనింగ్ క్వారీలను తన పేరు మార్చాలని వాణి తనపై ఒత్తిడి చేస్తోందని, తాను ఆమెను గుండెల మీద పెట్టుకున్నానని మనసులోని మాట బయటపెట్టాడు. వాణి తన గురించి పిల్లలకు చెడుగా చెప్పిందన్నారు.

 

తన భార్యకు టికెట్ ఇవ్వాలని జగన్‌కు చెప్పానని గుర్తు చేశారు దువ్వాడ శ్రీనివాస్. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా తన ఫ్యామిలీపై చర్చ జరుగుతోందన్నారు. వాణి ఆధ్వర్యంలో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, పార్టీకి వచ్చిన రిపోర్టు ప్రకారం తనకే అధిష్టానం టికెట్ కేటాయించిందన్నారు. తనకు గ్రానైట్ వ్యాపారమని, వచ్చిన సొమ్మంతా వాణికే ఇచ్చానని వివరించే ప్రయత్నం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *