ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 28మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ తిరుమలరావు ఆదేశాలతో డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పారదర్శకంగా పాలన అందించేందుకే గత కొంతకాలంగా పలు శాఖల్లో బదిలీలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. కాగా, టీడీపీ అధికారంలోకి వస్తే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపడతామని చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే పలు శాఖల్లో బదిలీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.